Tuesday, June 23, 2009

A Dream -- to Reality ....My Blog's Exclusive

This is one of my Childhood Dreams.....

To sing my all-time favourite song : Cheppalani Undi from RUDRAVEENA..

I am very glad to share with you all...

Monday, June 1, 2009

RudraVeena - Nammaku Nammaku

Film: Rudraveena
Singer: SPB
Music: Ilayaraja

RudraVeena - Nammaku Nammaku

సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
యెచ్చనైన ఊసులెన్నొ రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్ను కొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికె ఒద్దికైన సీకటి

పొద్దుపొడుపేలేని సీకటే ఉండిపోని
మనమధ్య రానీక లోకాన్ని నిదరోని
రాయె రాయె రామసిలక - సద్దుకు పోయె సీకటెనకా

నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను ...
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

వెన్నెలలోని మసకలలోనె మసలును లోకం అనుకోకు
రవి కిరణం కనపడితె తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని

ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండా
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు అది
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు హాహా
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని

శీతకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండె దినమే పండుగ కాద
పదుగురి సౌఖ్యం పండె దినమే పండుగ కాద
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
మ గసప దమద నిదని
మమమమ గస మమమమ దమ
దదదద నిద నినినిని
సగస నిసని దనిద మదమ
నిసని ద సని దనిద మసగ

నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు ఆహా
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను ...
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని



 
View My Stats