Wednesday, November 18, 2009

Sindhooram - paarahushaaraina paata

From the pen of Sirivennela

Film: Sindhooram

Rest of the details will be given by the lyrics itself!!!


పారాహుషారైన పాట - చిటికేసి రమ్మందిరో
పైలాపచ్చీసైన ఆట - చిందేసి లెమ్మందిరోయి


ఓరోరి బైరాగి ఈపొద్దు - ఈ జోరు ఆపొద్దు
కంజీర దరువెయ్యరో
ఊరూరా ఊరేగి ఈ డప్పు హోరెత్తి పోయేట్టు
ఊపెక్కిపోనీయరో


హే.. కస్టాలు కన్నీళ్ళకేంలే
వస్తూనె ఉంటాయిలే
నవ్వంటు తోడుంటే చాలే
ఏవైనా చేయొచ్చులే

మందిలో కొందరు రాబందులై
అందిందంతా కాజేసి జైహిందంటార
అహ ఒహొ అహ ఒహొహొహొహొ
మందలై పందలై పసి కందులై


జనమంతా తలలొంచేసి ఖర్మనుకుంటారా
బతకడం బరువయ్యేలా తెగ పీడిస్తుంటే ..
దారుణం దారులు మూసి వేటాడుతు ఉంటే
ప్రాణం విసిగి పిల్లే అయినా బెబ్బులి అయిపోదా


చీమంత ఓ చిన్న చినుకే - తుఫాను అవుతుందిలే
ఈనాటి ఈ నిప్పు తునకే - కార్చిచ్చు అవుతుందిలే


చిక్కగా చీకటే కమ్మిందనీ
లోకం వెళ్ళి సూర్యుణ్ణి రారమ్మని పిలవాలా
కొండలా పాపమే పెరిగిందనీ
కాపాడంటూ ఈ సంఘం మన సాయం అడగాల


కళ్ళల్లో కత్తులు దూసే కసి కలిగిందంటే
గుండెలో భగ్గున రేగె అగ్గి రగులుకుంటే
నెత్తురు మండే ప్రతి వాడు సూరీడే అయిపోడా


ఏ కొంప కొల్లేరు కాని
నాకేమి పట్టిందనీ
నిద్దర్లో మునిగున్నవాన్ని
కదిలించడం నీ పని


ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె
ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె


చావైతె ఈ పూట కాకుంటే
రేపైన వస్తుంది తప్పించుకోలేవులే
బతుకంటే మన చేతిలో ఉంది
భయమంటు వదిలేస్తె మనమాట వింటుందిలే


ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె
ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె

Monday, November 16, 2009

Arya 2 - Ringa Ringa


Not of regular types you find in my blog. pakka mass song...
Music : Devi Sri Prasad
Singer : Priya Hemesh,DSP
Film : Arya 2
Lyrics : Chandrabose

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
పోష్ పోష్ పరదేశి నేను
ఫారిన్ నుంచి వచ్చేసాను
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
రోషమున్నా కుర్రాళ్ళ కోసం
వాషింగ్టన్ను వదిలేసాను
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రె..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రె..
Air Bus ఎక్కి ఎక్కి రోతే పుట్టి
ఎర్రబస్సు మీద నాకు మోజే పుట్టీ
ఎర్రకోట చేరినాను, చేరినాక ఎదురు చూసినా
ఎవరి కోసం
బోడి మూతి ముద్దులంటె బోరే కొట్టి
కోర మీస కుర్రవాళ్ళ ఆరా పట్టి
బెంగులూరు కెళ్ళినాను, మంగులూరు కెళ్ళినాను
బీహారుకెళ్ళినాను, జైపూరు కెళ్ళినాను
రాయలోల్ల సీమ కొచ్చి సెట్టయ్యాను
ఓహో మరి ఇక్కడ కుర్రొళ్ళేంచేశారు..
కడప బాంబు కన్నుల్తో ఏసి కన్నె కొంప పేల్చేసారూ..
అమ్మనీ.....(chorus)
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేసారు..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
ఇది వాయించెహె (chorus)
రింగ హె రింగ రింగ
రింగ హె రింగ రింగ
రింగ హె రింగ రింగ
హొ ..
రింగ హె రింగ రింగ
రింగ హె రింగ రింగ
రింగ హె రింగ రింగ


ఇదిగో తెల్లపిల్ల, అదంతా సరే కాని అసలీ రింగ రింగా గోలేటి (chorus)
అసలుకేమో నా సొంత పేరు - ఏండ్రియానా స్క్వాజోరింగా
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
పలకలేకా ఈల్లెట్టినారు ముద్దు పేరు - రింగ రింగా ..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
జీన్స్ తీసి కట్టినారు వోణి లంగా
పాప్డి హైర్ కెట్టినారు సవరం బాగా
రాయ లాగ ఉన్న నన్ను రంగసాని చేసినారుగా
హై .. ఇంగులీషు మార్చినారు వెటకారంగా
ఇంటి యెనకకొచ్చినారు యమ కారంగా...
ఒంటిలోని వాటరంత చెమటలాగ పిండినారు
వొంపులోని అత్తరంత ఆవిరల్లె పీల్చినారు..
ఒంపి ఒంపి సొంపులన్ని తాగేసారు
ఐ బాబొయి తాగేసారా...ఇంకేంచేసారు..(chorus)
పుట్టుమచ్చలు లెక్కేట్టేశారు
లేని మచ్చలు పుట్టించారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
ఉన్న కొలతలు మార్చేసినారు
రాని మదతలు రప్పించారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..


ఇదిగో ఫారినమ్మయి.. ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవరు (chorus)
హాన్.. పంచకట్టు కుర్రళ్ళలోనా పుంచ్ నాకు తెలిసొచ్చిందీ
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
ముంతకల్లు లాగించేటోల్ల స్త్రెంగ్థ్ నాకు తెగ నచ్చిందీ
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
నీటి బెడ్డు సరసమంటె జర్రూ జర్రూ
నులకమంచమంటె ఇంక కిర్రూ కిర్రూ
సుర్రుమన్న సీనులన్ని ఫోన్లో ఫ్రెంద్స్ థొటి చెప్పినా
సెప్పేసేవేటి.....(chorus)
ఫైవ్ స్టార్ హోటలంటె కచ్చ పిచ్చ
పంపు సెట్టు మేటరైతె రచ్చొ రచ్చ..
అన్న మాట చెప్పగానె
IRELAND GREENLAND NEWZEALAND
NEDERLAND THAILAND FINLAND
అన్ని లాండ్ల పాపలీడ లాండయ్యారు..
లేండయ్యార, మరి మేమేం చెయ్యాలి....(chorus)
హేండ్ మీద హేండేసేయండి
లేండ్ కబ్జా చేసేయండి
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..
హేండ్ మీద హేండేసేస్థామె ....(chorus)
లేండ్ కబ్జా చేసేస్థామె......(chorus)
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రె..

Thursday, November 12, 2009

Sri Shirdi Sai Baba Mahatyam - baba sai baba

Film: Sri Shirdi Sai Baba Mahatyam
Singer: SPB
Lyrics: Acharya Atreya
Music: ?? :-(

బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
నీవు మావలె మనిషివనీ నీకు మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేది - అనుకుని ఎలా బ్రతికేది.
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా

నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు..
నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు..
నువ్వే దెవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం ..
శిధిలంగా అవుతుందా..
పిలిచినంతనే పలికే దైవం
మూగైపొతాడా

బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
నీవు మావలె మనిషివనీ నీకు మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేది - అనుకుని ఎలా బ్రతికేది.
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా

దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు రా
దిక్కుల లోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు రా
దిక్కుల లోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా

సూర్యచంద్రులును చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయా
గ్రహములు గోహాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం

లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ

కదిలె కాలాగ్ని .. ఎగిసే బడబాగ్నీ
దైవం ధర్మాన్నీ .. దగ్ధం చేసైనీ
నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్నూ ఐక్యం అయిపోనీ .. పోనీ

Antham - nee navvu cheppindi

Another master piece from SPB voice....

Lyrics: Sirivennela

Singer: SPB

Music: RD Burman


నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ లోటేమిటో


నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న ని
నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్న ని


నాతో సాగిన నీ అడుగులో చూసను మన రెపు ని
పంచెందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోనినడకెంత అలుపో అని


నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వ్ ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ


ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదె సుభముహూర్తం సంపూర్ణ మయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు

Thursday, October 29, 2009

Ek niranjan - title track

Film: Ek Niranjan

Music: Mani Sharma

Singer: Ranjit

Lyrics: Rama Jogayya Sastry



అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
పిల్ల లేదు పెళ్లి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామా లేడు ఏక్ నిరంజన్
వూరే లేదు నాకు పేరు లేదూ,
నీడా లేదు నాకే తోడే లేదు
నేనేవ్వరికి గుర్తే రాను,ఎక్కిల్లె రావసలె ,
నాకంటూ ఎవరులేరే కన్నిల్లె లేవులే
పది మన్ది లొ ఎకకిని నా లొకమెయ్ వెరె,ఎరగెసిన తిరగెసిన నెను ఎప్పుడు ఎహె ఒన్టరి వాడినెయ్

అమ్మ లెదు,నాన్న లెడు అక్క చెల్లి తమ్బి లెడు ఎక్ నిరన్జన్
Pఇల్ల లెదు పెల్లి లెదు,పిల్లనిcచి పెల్లి చీస్య్ మావ లెడు ఎక్ నిరన్జన్

c/ ప్లట్fఒర్మ్ స్/ బడ్ టిమె wఅర డొట్ cఒమ్
(c/o platform s/o bad time aawara dot com…)
దమ్మర దుమ్ tons of freedom మనకదెయ్ problem..

అరెయ్ date of birth ee తెలియదెయ్ పెనుగాలికి పెరిగాలెయ్..
జాలి జూల ఎరుగనెయ్ నా గొల ఎదొ నాదెయ్..
తిన్నవ దమ్మెసవ అని అడిగెది ఎవ్వడు లెయ్..
ఉన్న పొయవ అని చూసెయ్ దిక్కెలెడె..
పది మన్ది లొ ఎకకిని నా లొకమెయ్ వెరె..
ఎరగెసిన ,తిరగెసిన నెను ఎప్పుడు ఎహె ఒన్టరి వాడినెయ్

అమ్మ లెదు,నాన్న లెడు అక్క చెల్లి తమ్బి లెడు ఎక్ నిరన్జన్
తట్ట లెదు బుట్ట లెదు.. బుట్ట కిన్డ గుడ్డు పెట్టె పెట్ట లెదు ఎక్ నిరన్జన్

Dil is burning, full of feeling no one is caring..
Dats ok yaar చల్త yah నెనె నా darling…
కక చై అమ్మ నను లెర అన్టొన్ది..
గుక్కెడు రుమ్మ్య్ కమ్మగ నను పడుకొబెడుతున్ది..
ఎహె రూజన్త నాతొ నెనెయ్కల్లొను నెనెయ్ లెయ్..
తెల్లరితెయ్ మల్లి నెనె తెడ లెనె లెదెయ్..
పది మన్ది లొ ఎకకిని నా లొకమెయ్ వెరె.. ఎరగెసిన తిరగెసిన నెను ఎప్పుడు ఎహె ఒన్టరి వాడినెయ్

అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్
కిస్సు లెదు,మిస్సు లెదు.. కస్సు బుస్సు లాడెయ్ లస్కు లెదు ఎక్ నిరన్జన్

Friday, October 23, 2009

సింధూరం - అర్ధ శతాబ్దపు ..

I am not much sure about the lyricist, but should be Sirivennela.
Excellent Lyrics... and SPB done justice with his voice...

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ

స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా

దానికే సలాము చెద్దామా

శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం

ఈ రక్తపు సింధూరం

నీ పాపిటలో గట్టిగ దిద్దిన ప్రజలను చూడమ్మా

ఓ పవిత్ర భారతమా ...

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ

స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా

దాన్నే స్వరాజ్యమందామా


కులాల కోసం గుంపులు కడుతూ

మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి
తగువుకు లేస్తారే - జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్ధపు
ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని

నిజం తెలుసుకోరేం తెలిసి భుజం కలిపిరారేం
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం

జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా
ఓ అనాధ భారతమా ..

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా
దానికే సలాము చెద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవుల్లో క్రూరమ్రుగంలా
దాక్కుని ఉండాలా - వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్తవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో
కవాతు చెయ్యాలా - అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం సిలలా నిలుచుంటే

నడిచే శవాల శిగలో తురిమిన
నెత్తుటి మందారం - ఈ సంధ్యా సింధూరం

వేకువ వైపా చీకటిలోకా
ఎటు నడిపేనమ్మా - గతి తోచని భారతమా ..

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
యుద్ధనినాదపు అరాచకాన్నే స్వరాజ్యమందామా..
దానికే సలాము చెద్దామా

తన తలరాతను తనే రాయగల
అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతి ని
తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని
ప్రశ్నించడమే మానుకుని
కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని
నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని
శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున
సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం -
చూస్తు ఇంకా నిదురిస్తావా
విశాల భారతమా ఓ విశాద భారతమా..
అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా
దానికే సలాము చెద్దామా
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో గట్టిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా ...
అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా

Friday, October 9, 2009

ఆనందం - ఎవరైనా ఎపుడైనా

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చేర అసలెప్పుడు వదిలిందో

అణువణువూ మురిసేలా chiguraasalu మెరిసేలా
toli శకునం ఎపుడు ఎదురైందో

చూస్తూనే ఎక్కడినుంచో చైత్రం కలిసొస్తుంది
పోగామంచుని పో పోమ్మంటూ తరిమేస్తుంది

నెలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది ...

రుతువేప్పుడు మారిందో
బతుకేప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో .. ఓహ్ ఓహ్ ...

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చేర అసలెప్పుడు వదిలిందో

అణువణువూ మురిసేలా చిగురసాలు మెరిసేలా
తోలి శకునం ఎపుడు ఎదురైందో

Monday, September 28, 2009

Mahatma - indiramma intiperu

Movie Name : Mahatma
Language: Telugu
Singer (S) : S. P. Balasubrahmanyam
Lyricist : Sirivennela
Music Composer: Vijay Anthony
Director : Krishna Vamsi
Actors : Srikanth, Bhavana
Release Date: 2009

సిరివెన్నెల proved why he is special!!! చాల చక్కని భావం తో పద విన్యాసం. ఆవేశం, ఆవేదన సమ్మేళనం.

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

ఇందిరమ్మ ఇంటి పేరు కాదు గాంధీ..
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ.. [ఇందిరమ్మ..]

కరెన్సీ నోట్ మీద....ఇలా నది రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు గాంధీ
భరత మత తల రాతను మార్చిన విధాత గాంధీ

తర తరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ ...... [indiramma..]

రామ నామమె తలపంత...ప్రేమ ధామమే మనసంత
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవదూత
అపురూపం చరిత..
కర్మ యోగమే జన్మంతా..
ధర్మ క్షేత్రమే బ్రతుకంత...

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీతా..
బూసి నోటి తాతా..

మనలాగే తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముదంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి..
నవ శకానికే నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పూగేసి..నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత..
సిసలైన జగ్గజేత....

ఛరకా యంత్రం చూపించి..స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత...
సంకల్ప బలం చేత....

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెలరని నడిరాత్రికి స్వేచ్చా బాణుడి ప్రభాత కాంతి..
పదవులు కోరని పావని మూర్తి....
హృదయాలేలిన చక్రవర్తి..

ఇలాంటి నరుడొక దిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం నా మతం...
అంటరాని తనని అంతః కలహలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం...

హే రాం....

Wednesday, September 23, 2009

కొండవీటి దొంగ - జీవితమే ఒక ఆట

this is a beautiful song -- chiru and ilayaraja combination

Release date: 9/3/1990

Banner: Sri Vijayalaxmi Art

Lead: Chiranjeevi, Vijayashanti, Radha

Producer: T Trivikrama Rao

Lyrics: Sirivennela

Director: A. Kodandarami Reddy

Music: Ilayaraja

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు

అనాధలైన అభాగ్యులైనా అంతా నావాళ్ళు

ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు - 2

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

అనాధ జీవుల.. ఉగాది కోసం..
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
బూర్జువాలకు.. భూస్వాములకు ..
బూర్జువాలకు భూస్వాములకు బూజు దులపక తప్పదు రా
తప్పదు రా తప్పదు రా తప్పదు రా

||జీవితమే ఒక ఆట సాహసమే పూబాట ||

న్యాయదేవతకు.. కన్నులు తెరిచే..
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చక తప్పదు రా
తప్పదు రా తప్పదు రా తప్పదు రా

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు

అనాధలైన అభాగ్యులైనా అంతా నావాళ్ళు

ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు - 2

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

 
View My Stats