Showing posts with label జీవితమే ఒక ఆట. Show all posts
Showing posts with label జీవితమే ఒక ఆట. Show all posts

Wednesday, September 23, 2009

కొండవీటి దొంగ - జీవితమే ఒక ఆట

this is a beautiful song -- chiru and ilayaraja combination

Release date: 9/3/1990

Banner: Sri Vijayalaxmi Art

Lead: Chiranjeevi, Vijayashanti, Radha

Producer: T Trivikrama Rao

Lyrics: Sirivennela

Director: A. Kodandarami Reddy

Music: Ilayaraja

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు

అనాధలైన అభాగ్యులైనా అంతా నావాళ్ళు

ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు - 2

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

అనాధ జీవుల.. ఉగాది కోసం..
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
బూర్జువాలకు.. భూస్వాములకు ..
బూర్జువాలకు భూస్వాములకు బూజు దులపక తప్పదు రా
తప్పదు రా తప్పదు రా తప్పదు రా

||జీవితమే ఒక ఆట సాహసమే పూబాట ||

న్యాయదేవతకు.. కన్నులు తెరిచే..
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చక తప్పదు రా

View My Stats