Monday, September 28, 2009

Mahatma - indiramma intiperu

Movie Name : Mahatma
Language: Telugu
Singer (S) : S. P. Balasubrahmanyam
Lyricist : Sirivennela
Music Composer: Vijay Anthony
Director : Krishna Vamsi
Actors : Srikanth, Bhavana
Release Date: 2009

సిరివెన్నెల proved why he is special!!! చాల చక్కని భావం తో పద విన్యాసం. ఆవేశం, ఆవేదన సమ్మేళనం.

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

ఇందిరమ్మ ఇంటి పేరు కాదు గాంధీ..
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ.. [ఇందిరమ్మ..]

కరెన్సీ నోట్ మీద....ఇలా నది రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు గాంధీ
భరత మత తల రాతను మార్చిన విధాత గాంధీ

తర తరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ ...... [indiramma..]

రామ నామమె తలపంత...ప్రేమ ధామమే మనసంత
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవదూత
అపురూపం చరిత..
కర్మ యోగమే జన్మంతా..
ధర్మ క్షేత్రమే బ్రతుకంత...

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీతా..
బూసి నోటి తాతా..

మనలాగే తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముదంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి..
నవ శకానికే నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పూగేసి..నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత..
సిసలైన జగ్గజేత....

ఛరకా యంత్రం చూపించి..స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత...
సంకల్ప బలం చేత....

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెలరని నడిరాత్రికి స్వేచ్చా బాణుడి ప్రభాత కాంతి..
పదవులు కోరని పావని మూర్తి....
హృదయాలేలిన చక్రవర్తి..

ఇలాంటి నరుడొక దిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం నా మతం...
అంటరాని తనని అంతః కలహలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం...

హే రాం....

Wednesday, September 23, 2009

కొండవీటి దొంగ - జీవితమే ఒక ఆట

this is a beautiful song -- chiru and ilayaraja combination

Release date: 9/3/1990

Banner: Sri Vijayalaxmi Art

Lead: Chiranjeevi, Vijayashanti, Radha

Producer: T Trivikrama Rao

Lyrics: Sirivennela

Director: A. Kodandarami Reddy

Music: Ilayaraja

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు

అనాధలైన అభాగ్యులైనా అంతా నావాళ్ళు

ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు - 2

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

అనాధ జీవుల.. ఉగాది కోసం..
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
బూర్జువాలకు.. భూస్వాములకు ..
బూర్జువాలకు భూస్వాములకు బూజు దులపక తప్పదు రా
తప్పదు రా తప్పదు రా తప్పదు రా

||జీవితమే ఒక ఆట సాహసమే పూబాట ||

న్యాయదేవతకు.. కన్నులు తెరిచే..
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చక తప్పదు రా
తప్పదు రా తప్పదు రా తప్పదు రా

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు

అనాధలైన అభాగ్యులైనా అంతా నావాళ్ళు

ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు - 2

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

 
View My Stats