Singer: SPB
Lyrics: Acharya Atreya
Music: ?? :-(
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
నీవు మావలె మనిషివనీ నీకు మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేది - అనుకుని ఎలా బ్రతికేది.
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు..
నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు..
నువ్వే దెవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం ..
శిధిలంగా అవుతుందా..
పిలిచినంతనే పలికే దైవం
మూగైపొతాడా
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
నీవు మావలె మనిషివనీ నీకు మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేది - అనుకుని ఎలా బ్రతికేది.
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు రా
దిక్కుల లోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు రా
దిక్కుల లోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్యచంద్రులును చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయా
గ్రహములు గోహాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ
కదిలె కాలాగ్ని .. ఎగిసే బడబాగ్నీ
దైవం ధర్మాన్నీ .. దగ్ధం చేసైనీ
నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్నూ ఐక్యం అయిపోనీ .. పోనీ
1 comment:
Balu garu jeevam posi paderu
Post a Comment