ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి(2)
బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ
సాగాలిప్రతి నిమిషం ప్రియా
ప్రియాపాటలాగ సాగాలి(ప్రతి రాత్రి)
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి(2)
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి(2)
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి(ప్రతి రాత్రి)
ఒరిగింది చంద్రవంక వయ్యారి తారక వంక(2)
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత(2)
నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియావనమంతా వలచింది(ప్రతి రాత్రి)
No comments:
Post a Comment