Movie : Surya S/o Krishnan
Music: Harris Jairaj
Singer: Sudha Raghunathan
Lyrics : Veturi
నిదరే కల అయినది కలయే నిజమైనది
బతకే జట అయినది - జతయే అతనన్నది
మనసేమో ఆగదు - క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా -- 2
వయసంత వసంతగాలి - మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి గాలి - చిగురులతో చిలకలతో
యమునకొకే సంగమమే కడలి నది కలవదులే
హృదయమిలా అంకితమై నిలిచినది తనకొరకే
పడిన ముడి పడుచువొడి యదలో చిరుమువ్వల సవ్వడి
నిదరే కల అయినది కలయే నిజమైనది
బతకే జట అయినది - జతయే అతనన్నది
మనసేమో ఆగదు - క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా
అభిమానం అనేది మౌనం పెదవులపై పలకదులే
అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే
నినుకలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి
నిను తగిలిన ఈ తనువే పులకరించే యెదరగిలి
ఎదుటపడి కుదుటపడే మమకారపు నివాళి లే ఇది
నిదరే కల అయినది కలయే నిజమైనది
బతకే జట అయినది - జతయే అతనన్నది
మనసేమో ఆగదు - క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా
No comments:
Post a Comment