one of the Good songs of recent melodies
after a longtime, ChandraBose has given nice lyrics to a Good melody...
Music: M M Keeravani
Singers: Anooj Guruwara, Reeta, Chandra Bose
************************************
పంచదార బొమ్మబొమ్మ పంచుకోవద్దనకమ్మ
bunch పూల కొమ్మ కొమ్మ
చేతినే తాకోద్దంటే చెంతకే రావద్దంటే ఏమౌతానమ్మ
నినుపొందేటందుకు పుట్టానే గుమ్మ
నువ్వు అందక పోతే వృధా ఈ జన్మా .....2
******************************************
******************************************
******************************************
పువ్వుపైన చెయ్యేస్తే - కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు నాకు నావెంట ఈ పువ్వు చుట్టు ముళ్ళంట
అంటుకుంటె మంటె అంటా ఒళ్ళంతా ...
తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందె
మెరుపు వెంట ఉరుమంట - ఊరుమువెంట వరదంట
వరదలాగ మారితే ముప్పంటా ..
వరదైనా వరమని వరిస్తానమ్మ ...
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా...
నిను పొందేటందుకు పుట్టానే గుమ్మా..
నువు అందక పోతె వృధా ఈ జన్మా...
******************************************
******************************************
******************************************
గాలి నిన్ను తాకింది - నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా...
గాలి ఊపిరయ్యింది - నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలో గొప్పా...
వెలుగు నిన్ను తాకింది - చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైనా
వెలుగు దారి చూపింది - చినుకు లాల పొసింది..
వాటితోని పోలిక నీకేలా ..
అవి బతికున్నప్పుడె తోడుంటాయమ్మ..
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా.....
నిను పొందేటందుకె పుట్టానె బొమ్మ...
నువు అందక పోతె వృధా ఈ జన్మా...
******************************************
******************************************