Wednesday, August 12, 2009

స్నేహితుడా - ఇంతకీ నువ్వెవరూ

నా ప్రియమైన స్నేహానికి చిరు కానుక గా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*******************
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
ఇంతకు ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకూ వచ్చి వచ్చి చెప్పినవారె లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరునిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకు
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అనీ
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
*********************
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*********************
ఎందుకో ఏమిటో నేనూ చెప్పలేను కానీ కలిసావు తీయనైన వేళా
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ...
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
*************************
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*************************
ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తు ఉంటే నీ తీరే ఆశ రేపె నాలో ..
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైనా సమయమా గమనమా చెప్పవే అతనికీ
చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరునిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకు
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అనీ
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు

No comments:

 
View My Stats