Friday, October 23, 2009

సింధూరం - అర్ధ శతాబ్దపు ..

I am not much sure about the lyricist, but should be Sirivennela.
Excellent Lyrics... and SPB done justice with his voice...

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ

స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా

దానికే సలాము చెద్దామా

శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం

ఈ రక్తపు సింధూరం

నీ పాపిటలో గట్టిగ దిద్దిన ప్రజలను చూడమ్మా

ఓ పవిత్ర భారతమా ...

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ

స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా

దాన్నే స్వరాజ్యమందామా


కులాల కోసం గుంపులు కడుతూ

మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి
తగువుకు లేస్తారే - జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్ధపు
ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని

నిజం తెలుసుకోరేం తెలిసి భుజం కలిపిరారేం
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం

జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా
ఓ అనాధ భారతమా ..

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా
దానికే సలాము చెద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవుల్లో క్రూరమ్రుగంలా
దాక్కుని ఉండాలా - వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్తవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో
కవాతు చెయ్యాలా - అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం సిలలా నిలుచుంటే

నడిచే శవాల శిగలో తురిమిన
నెత్తుటి మందారం - ఈ సంధ్యా సింధూరం

వేకువ వైపా చీకటిలోకా
ఎటు నడిపేనమ్మా - గతి తోచని భారతమా ..

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
యుద్ధనినాదపు అరాచకాన్నే స్వరాజ్యమందామా..
దానికే సలాము చెద్దామా

తన తలరాతను తనే రాయగల
అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతి ని
తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని
ప్రశ్నించడమే మానుకుని
కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని
నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని
శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున
సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం -
చూస్తు ఇంకా నిదురిస్తావా
విశాల భారతమా ఓ విశాద భారతమా..
అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా
దానికే సలాము చెద్దామా
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో గట్టిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా ...
అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా

No comments:

 
View My Stats