Tuesday, May 4, 2010

One of the Best - From Sirivennela




Movie Name: Pattudala
Singers: J Yesudasu

Lyricist: Siri Vennela Seeta Rama Sastry

Music Director:Madavapeddi Suresh
Director: Sekar GB
Year: 1992


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి..

విశ్రమించ వద్దు ఏ క్షణం..
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా .
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి..


నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదురా..
గుటకపడని అగ్గి ఉండ సాగారలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా..

నిశా విలాసమెంతసేపురా..
ఉషోదయాన్ని ఎవ్వడాపురా..
రగులుతున్న గుండె కూడ సూర్యగోల మంటిదేనురా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున..
నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు.. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ..

దేహముంది ధైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా..
ఆశ నీకు అస్త్ర మౌను, శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా ..
నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా..
ఆయువంటు ఉన్న వరుకు చావు కూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటురా..


No comments:

 
View My Stats