Monday, July 5, 2010

Detective NArada - Premayatralaku ..

యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా.. హః
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..
వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో...
హహహః..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో

యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ..
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..

జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి వెన్నెలమ్మ జాడ చెప్పవా..
చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా..
హహహః...
హహహః
హాహహహ్హ
చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా..
వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో చెలి రగలాలా
సఖి నెరి చూపుల చల్లదనంతో జగములె ఊటి శాయగా..

యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ..
ప్రేమయాత్రలకుబృందావనము నందనవనము ఏలనో..

కన్న ప్రేమ లేని లేత కన్నె గువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా...
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా..హాహహః
హహహ
హాహహః
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా.
ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరనే
సతి ఆదరనే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా..

యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా.. హః
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..
వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో...
హహహః..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా.. హః
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..

No comments:

View My Stats