అ: సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తేని చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే వొళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
అరెరెరె ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
ఆ: సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోఏవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
చరణం1:
ఆ: కొండ కోన జలకాలాడేవేల
కొమ్మ రెమ్మ చీర కట్టేవేల
అ: పిందేపండై చిలక కొట్టేవేల
పిల్లగాలి నిదరే పోఏవేల
ఆ: కలలో కౌగిలే కన్ను దాటాలా
అ: ఎదలే పోదరిల్లై వాకిలి తీయ్యాల
ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వేయ్యాల
చరణం2:
అ: మల్లె జాజి మత్తు జల్లేవేల
పిల్ల గాలి జోలపాడే వేల
ఆ: వానే వాగై వరదై పొంగేవేల
నేనే నీవై వలపై సాగేవేల
అ: కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
ఆ: పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నెలగువ్వ చీకటి గువ్వలాడాలా
అ: సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
ఆ: అందగాడికి తోడు చలిగాలి రమ్మంది