Monday, July 5, 2010

Maya Bazaar - neevenaa nanu talachinadi

నీవేనా.... ఆ....
నీవేనా నను తలచినది
నీవేన నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది
నీవేనా...
నీవేలె నను తలచినది
నీవేలె నను పిలచినది
నీవేలె నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది
నీవేలె

కలలోనే ఒక మెళకువ గా ఆ మెలకువలోనే ఒక కలగా - 2
కలయో నిజమో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయంలో..
నీవేనా.... ఆ....
నీవేనా నను తలచినది
నీవేన నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది
నీవేనా...

కన్నుల వెన్నెల కాయించి, నా మనసున వెన్నెల పూయించి -2
కనులను మనసుని కరిగించి మైమరపించి నన్నలరించి...
నీవేలె నను తలచినది
నీవేలె నను పిలచినది
నీవేలె నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది
నీవేలె
నీవేలె

pingali lyrics

No comments:

 
View My Stats