From the pen of Sirivennela
Film: Sindhooram
Rest of the details will be given by the lyrics itself!!!
పారాహుషారైన పాట - చిటికేసి రమ్మందిరో
పైలాపచ్చీసైన ఆట - చిందేసి లెమ్మందిరోయి
ఓరోరి బైరాగి ఈపొద్దు - ఈ జోరు ఆపొద్దు
కంజీర దరువెయ్యరో
ఊరూరా ఊరేగి ఈ డప్పు హోరెత్తి పోయేట్టు
ఊపెక్కిపోనీయరో
హే.. కస్టాలు కన్నీళ్ళకేంలే
వస్తూనె ఉంటాయిలే
నవ్వంటు తోడుంటే చాలే
ఏవైనా చేయొచ్చులే
మందిలో కొందరు రాబందులై
అందిందంతా కాజేసి జైహిందంటార
అహ ఒహొ అహ ఒహొహొహొహొ
మందలై పందలై పసి కందులై
జనమంతా తలలొంచేసి ఖర్మనుకుంటారా
బతకడం బరువయ్యేలా తెగ పీడిస్తుంటే ..
దారుణం దారులు మూసి వేటాడుతు ఉంటే
ప్రాణం విసిగి పిల్లే అయినా బెబ్బులి అయిపోదా
చీమంత ఓ చిన్న చినుకే - తుఫాను అవుతుందిలే
ఈనాటి ఈ నిప్పు తునకే - కార్చిచ్చు అవుతుందిలే
చిక్కగా చీకటే కమ్మిందనీ
లోకం వెళ్ళి సూర్యుణ్ణి రారమ్మని పిలవాలా
కొండలా పాపమే పెరిగిందనీ
కాపాడంటూ ఈ సంఘం మన సాయం అడగాల
కళ్ళల్లో కత్తులు దూసే కసి కలిగిందంటే
గుండెలో భగ్గున రేగె అగ్గి రగులుకుంటే
నెత్తురు మండే ప్రతి వాడు సూరీడే అయిపోడా
ఏ కొంప కొల్లేరు కాని
నాకేమి పట్టిందనీ
నిద్దర్లో మునిగున్నవాన్ని
కదిలించడం నీ పని
ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె
ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె
చావైతె ఈ పూట కాకుంటే
రేపైన వస్తుంది తప్పించుకోలేవులే
బతుకంటే మన చేతిలో ఉంది
భయమంటు వదిలేస్తె మనమాట వింటుందిలే
ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె
ఓలెల్లె ఓలెల్లె ఓలె
ఓలెల్లె ఓలెల్లె లె