Friday, October 23, 2009

సింధూరం - అర్ధ శతాబ్దపు ..

I am not much sure about the lyricist, but should be Sirivennela.
Excellent Lyrics... and SPB done justice with his voice...

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ

స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా

దానికే సలాము చెద్దామా

శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం

ఈ రక్తపు సింధూరం

నీ పాపిటలో గట్టిగ దిద్దిన ప్రజలను చూడమ్మా

ఓ పవిత్ర భారతమా ...

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ

స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా

దాన్నే స్వరాజ్యమందామా


కులాల కోసం గుంపులు కడుతూ

మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి
తగువుకు లేస్తారే - జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్ధపు
ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని

నిజం తెలుసుకోరేం తెలిసి భుజం కలిపిరారేం
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం

జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా
ఓ అనాధ భారతమా ..

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా
దానికే సలాము చెద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవుల్లో క్రూరమ్రుగంలా
దాక్కుని ఉండాలా - వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్తవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో
కవాతు చెయ్యాలా - అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం సిలలా నిలుచుంటే

నడిచే శవాల శిగలో తురిమిన
నెత్తుటి మందారం - ఈ సంధ్యా సింధూరం

వేకువ వైపా చీకటిలోకా
ఎటు నడిపేనమ్మా - గతి తోచని భారతమా ..

అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
యుద్ధనినాదపు అరాచకాన్నే స్వరాజ్యమందామా..
దానికే సలాము చెద్దామా

తన తలరాతను తనే రాయగల
అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతి ని
తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని
ప్రశ్నించడమే మానుకుని
కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని
నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని
శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున
సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం -
చూస్తు ఇంకా నిదురిస్తావా
విశాల భారతమా ఓ విశాద భారతమా..
అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా
దానికే సలాము చెద్దామా
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో గట్టిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా ...
అర్థ శతాబ్ధపు అఙానాన్నే స్వతంత్ర్యమందామ
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా

Friday, October 9, 2009

ఆనందం - ఎవరైనా ఎపుడైనా

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చేర అసలెప్పుడు వదిలిందో

అణువణువూ మురిసేలా chiguraasalu మెరిసేలా
toli శకునం ఎపుడు ఎదురైందో

చూస్తూనే ఎక్కడినుంచో చైత్రం కలిసొస్తుంది
పోగామంచుని పో పోమ్మంటూ తరిమేస్తుంది

నెలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది ...

రుతువేప్పుడు మారిందో
బతుకేప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో .. ఓహ్ ఓహ్ ...

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలి చేర అసలెప్పుడు వదిలిందో

అణువణువూ మురిసేలా చిగురసాలు మెరిసేలా
తోలి శకునం ఎపుడు ఎదురైందో

Monday, September 28, 2009

Mahatma - indiramma intiperu

Movie Name : Mahatma
Language: Telugu
Singer (S) : S. P. Balasubrahmanyam
Lyricist : Sirivennela
Music Composer: Vijay Anthony
Director : Krishna Vamsi
Actors : Srikanth, Bhavana
Release Date: 2009

సిరివెన్నెల proved why he is special!!! చాల చక్కని భావం తో పద విన్యాసం. ఆవేశం, ఆవేదన సమ్మేళనం.

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

ఇందిరమ్మ ఇంటి పేరు కాదు గాంధీ..
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ.. [ఇందిరమ్మ..]

కరెన్సీ నోట్ మీద....ఇలా నది రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు గాంధీ
భరత మత తల రాతను మార్చిన విధాత గాంధీ

తర తరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ ...... [indiramma..]

రామ నామమె తలపంత...ప్రేమ ధామమే మనసంత
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవదూత
అపురూపం చరిత..
కర్మ యోగమే జన్మంతా..
ధర్మ క్షేత్రమే బ్రతుకంత...

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీతా..
బూసి నోటి తాతా..

మనలాగే తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముదంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి..
నవ శకానికే నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పూగేసి..నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత..
సిసలైన జగ్గజేత....

ఛరకా యంత్రం చూపించి..స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత...
సంకల్ప బలం చేత....

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెలరని నడిరాత్రికి స్వేచ్చా బాణుడి ప్రభాత కాంతి..
పదవులు కోరని పావని మూర్తి....
హృదయాలేలిన చక్రవర్తి..

ఇలాంటి నరుడొక దిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం నా మతం...
అంటరాని తనని అంతః కలహలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం...

హే రాం....

Wednesday, September 23, 2009

కొండవీటి దొంగ - జీవితమే ఒక ఆట

this is a beautiful song -- chiru and ilayaraja combination

Release date: 9/3/1990

Banner: Sri Vijayalaxmi Art

Lead: Chiranjeevi, Vijayashanti, Radha

Producer: T Trivikrama Rao

Lyrics: Sirivennela

Director: A. Kodandarami Reddy

Music: Ilayaraja

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు

అనాధలైన అభాగ్యులైనా అంతా నావాళ్ళు

ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు - 2

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

అనాధ జీవుల.. ఉగాది కోసం..
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
అనాధ జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
బూర్జువాలకు.. భూస్వాములకు ..
బూర్జువాలకు భూస్వాములకు బూజు దులపక తప్పదు రా
తప్పదు రా తప్పదు రా తప్పదు రా

||జీవితమే ఒక ఆట సాహసమే పూబాట ||

న్యాయదేవతకు.. కన్నులు తెరిచే..
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
న్యాయదేవతకు కన్నులు తెరిచే ధర్మదేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాత నై వస్తా రా
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం
దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చక తప్పదు రా
తప్పదు రా తప్పదు రా తప్పదు రా

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు

అనాధలైన అభాగ్యులైనా అంతా నావాళ్ళు

ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు - 2

జీవితమే ఒక ఆట - సాహసమే పూబాట -2

Thursday, August 20, 2009

ఆంజనేయులు - నువ్వే కంట పడకుంటే

నువ్వే కంట పడనంటే కంట తడి అంటు ఆగనంది
ఇలా నన్ను నడిపించే నువ్వు లేవంటే నమ్మనంది
వెళ్ళే ee దారి అంత మన జ్ఞాపకాలే ఎటు చూసినా
క్షణం శిలై ఆగి పోదు ప్రాయం మాసిపోదు ఏం చేసినా
వీడుకోలంటూ వెళ్ళిపోయావా నన్ను మాత్రం నవ్వమన్నావా
ఒంటరయ్యింది అల్లరేనా వెంట నువ్వు లేవనీ
అడుగడుగునా నలిగా
నీ మమతకై వెతికా
నిదురన్నదే రాదు
నిజమన్నదే చేదు
పైవాడెలా రాసాడిలా --2

Monday, August 17, 2009

MagaDheera - panchadhara chilakavamma

one of the Good songs of recent melodies
after a longtime, ChandraBose has given nice lyrics to a Good melody...
Music: M M Keeravani
Singers: Anooj Guruwara, Reeta, Chandra Bose

************************************

పంచదార బొమ్మబొమ్మ పంచుకోవద్దనకమ్మ

bunch పూల కొమ్మ కొమ్మ
చేతినే తాకోద్దంటే చెంతకే రావద్దంటే ఏమౌతానమ్మ
నినుపొందేటందుకు పుట్టానే గుమ్మ
నువ్వు అందక పోతే వృధా ఈ జన్మా .....2
******************************************
******************************************
******************************************
పువ్వుపైన చెయ్యేస్తే - కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు నాకు నావెంట ఈ పువ్వు చుట్టు ముళ్ళంట
అంటుకుంటె మంటె అంటా ఒళ్ళంతా ...
తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందె
మెరుపు వెంట ఉరుమంట - ఊరుమువెంట వరదంట
వరదలాగ మారితే ముప్పంటా ..
వరదైనా వరమని వరిస్తానమ్మ ...
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా...
నిను పొందేటందుకు పుట్టానే గుమ్మా..
నువు అందక పోతె వృధా ఈ జన్మా...
******************************************
******************************************
******************************************
గాలి నిన్ను తాకింది - నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా...
గాలి ఊపిరయ్యింది - నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలో గొప్పా...
వెలుగు నిన్ను తాకింది - చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైనా
వెలుగు దారి చూపింది - చినుకు లాల పొసింది..
వాటితోని పోలిక నీకేలా ..
అవి బతికున్నప్పుడె తోడుంటాయమ్మ..
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా.....
నిను పొందేటందుకె పుట్టానె బొమ్మ...
నువు అందక పోతె వృధా ఈ జన్మా...
******************************************
******************************************

Wednesday, August 12, 2009

స్నేహితుడా - ఇంతకీ నువ్వెవరూ

నా ప్రియమైన స్నేహానికి చిరు కానుక గా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*******************
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
ఇంతకు ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకూ వచ్చి వచ్చి చెప్పినవారె లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరునిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకు
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అనీ
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
*********************
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*********************
ఎందుకో ఏమిటో నేనూ చెప్పలేను కానీ కలిసావు తీయనైన వేళా
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ...
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
*************************
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*************************
ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తు ఉంటే నీ తీరే ఆశ రేపె నాలో ..
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైనా సమయమా గమనమా చెప్పవే అతనికీ
చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ
ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరునిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకు
నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అనీ
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు

Monday, July 27, 2009

Chudalani Undi - yamahaa nagari

This is again one of my all-time favourites ...
Dedicating this to all Chiru and Mani Sharma Fans...........


స రి మ మ గ రి
స స స ని ద ప స .........2
రె మ ద ని ద ప
స స ని ద ప
మ గ ప మ రి
యమహా నగరి కలకత్తా పురి
యమహా నగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి ...3
యమహా నగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధి

నేతాజి పుట్టిన చోటా
గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటె ఆ నందుడు చూపిన బాట సాగనా
పదగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదలి పోరా
ఒకరితొ ఒకరికి ముఖపరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో

యమహా నగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి ...2
యమహా నగరి కలకత్తా పురి


బెంగాలి కోకిల బాల - తెలుగింటి కోడలు పిల్ల
మానిని సరోజిని
రోజంతా సూర్యుడికిందా రాత్రంతా రజనీ కిందా సాగనీ..
పదగురు ప్రేమలే లేని లోకం
దేవతా మార్కు మైకం
షరన్నవళాభిషేకం తెలుసుకోరా
కధలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిథుల గొదవట
కలకట నగరుకు కిట కిటలో

యమహా నగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి ...2
యమహా నగరి కలకత్తా పురి

వందేమాతరమే అన్నా వంగా భూతలమే మిన్నా
జాతికే గీతిరా
మాతంగి కాళి నిలయా చౌరంగి రంగుల దునియా నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార
యెస్ డి బర్మన్ కి ధార
థెరీస్సాకి కుమారా
కదలి రారా
జన గణ మనముల
స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ సుఖ పిక ముఖ సుఖ రవళులతో

యమహా నగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధి
యమహా నగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి ...3
యమహా నగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధి

Thursday, July 9, 2009

Gopi Gopika Godavari

This song(post) is dedicated to one of my best pals... Reshma!!
A typical Vamsi's movie song :-)....
Apt to my blog name -- Sing along .....The Song
...................................................................................
...........................................................................
.................................................................
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానంది వేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది
నీలానీ ఊహలో కలా ఊగింది ఊయల
ఆకాశ వాణిలా పాడింది కోకిలా ..

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటేనేనక్కడుంటే మౌనం గల గల్
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా
కలలొలికేనావర్ణమై వచ్చానా వర్ణమే పాడానా
జాణ తెలుగులా జాన వెలుగులా
వెన్నెలై గిచ్చానా వేకువే తేచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పొలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జూల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపన
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరపునా గీత చెరపనా
ఎంత దూరాన నే ఉన్నా నీతోనే నే లీనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా....
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
.................................................................
............................................................................
.......................................................................................

Tuesday, June 23, 2009

A Dream -- to Reality ....My Blog's Exclusive

This is one of my Childhood Dreams.....

To sing my all-time favourite song : Cheppalani Undi from RUDRAVEENA..

I am very glad to share with you all...

Monday, June 1, 2009

RudraVeena - Nammaku Nammaku

Film: Rudraveena
Singer: SPB
Music: Ilayaraja

RudraVeena - Nammaku Nammaku

సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
యెచ్చనైన ఊసులెన్నొ రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్ను కొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికె ఒద్దికైన సీకటి

పొద్దుపొడుపేలేని సీకటే ఉండిపోని
మనమధ్య రానీక లోకాన్ని నిదరోని
రాయె రాయె రామసిలక - సద్దుకు పోయె సీకటెనకా

నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను ...
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

వెన్నెలలోని మసకలలోనె మసలును లోకం అనుకోకు
రవి కిరణం కనపడితె తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని

ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండా
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు అది
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు హాహా
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని

శీతకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండె దినమే పండుగ కాద
పదుగురి సౌఖ్యం పండె దినమే పండుగ కాద
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
మ గసప దమద నిదని
మమమమ గస మమమమ దమ
దదదద నిద నినినిని
సగస నిసని దనిద మదమ
నిసని ద సని దనిద మసగ

నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు ఆహా
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను ...
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని



Monday, May 25, 2009

శ్రీ మంజునాథ - స్వాగతమయ్యా ఓ యమ రాజ

This is one of my favourite songs. Siva's devotee inviting the Lord Yama to take him away from this material world....And the lyrics goes like this -- I dont have the lyricist details with me right now, if any of you have it, plz let me know I would update.

Film: Sri Manjunatha
Music: HamsaLekha
Singer: SPB at his best as usual ....



శ్రీ మంజునాథ - స్వాగతమయ్యా


ప్రాణాలనే పంచభక్శాలుగా అర్పించెద రా యమ రాజ ... హ ...శివ
స్వాగతమయ్యా
యమ రాజ యమ రాజ యమ రాజ
స్వాగతమయ్యా
యమ రాజ యమ రాజ యమ రాజ
మాయ తెరా - దింపెయగా రారా

శ్వాస నువ్వే శాంతి నువ్వే - స్వర్గమిచ్చేసఖుడు నువ్వే ..మృత్యుదేవ...
ఎందరున్నా ఎన్ని ఉన్నా వెంట వచ్చే చివరి తోడూ మరణమేరా
లేనిదేం పోదు రా - పోనిదేం రాదురా - ఆలించారా పరిపాలించారా
కొనిపోరా యమ రాజా ... హ .. హరా
తనువొక మాయ జవరాయ జవరాయ జవరాయ
మాయ తెరా - దింపెయగా రారా



ముద్దు చేసి ముడిని తెంచి ఎదను చేర్చి ఎత్తుకెళ్ళే ... తండ్రి నువ్వే
లాలి పాడీ నిదురపుచ్చి వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే
లెక్కలే చెల్లె రా - బంధమే తీరేరా
పాలించారా .. పంట పండింది రా ..
కరుణామయా కడతేర్చరా .. హ.. ఈశ్వర
స్వాగతమయ్యా
యమ రాజ యమ రాజ యమ రాజ
స్వాగతమయ్యా
యమ రాజ... యమ రాజ యమ రాజ
యమ రాజ యమ రాజ

Wednesday, May 13, 2009

Neerajanam - ee vishaala prashanta

విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా
విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా

పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళా కాంతుల్లో
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళా కాంతుల్లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా

విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా


నీ జీవిత జ్యోతి నీ మధుర మూర్తి
నీ జీవిత జ్యోతి నీ మధుర మూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా

విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో
నిదురించు జహాపనా నిదురించు జహాపనా






Hrudayam - oosulaade oka jaabilamma

Movie: Hrudayam
Singer: SPB


ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపెనటా
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపెనటా
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ..
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపెనటా


అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను జపించేను రోజు
ననే చూసే వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను

ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపెనటా
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ..
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపెనటా



నాలోనే రేగే పాట చేలిపాట నీడల్లే సాగే వెంట నీ వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరిన ఇలా ఊహల్లోనా సదా ఉంది పోనా
ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో ..

ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపెనటా
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ..
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకెనటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపెనటా
 
View My Stats