Tuesday, May 12, 2009

క్షణక్షణం - జామురాతిరి జాబిలమ్మ

Film: KshanaKshanam


జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇల
జోరు గాలిలో జాజి కొమ్మ
జార నీయకే కలా
వయారి వాలు కళ్ళలోన
వరాల వెండి పూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా..



కుహు కుహు సరాగాలే సృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకురాక బుట్టబొమ్మ గుబులుగుందని
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని

జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా



మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషా తీరం వెతుకుతూ
నిదరతో నిషారాణి నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మా ఉదయ కాంతికి

జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజి కొమ్మ
జార నీయకే కలా
వయారి వాలు కళ్ళలోన
వరాల వెండి పూల వాన
స్వరాల ఊయలూగు వేళ

No comments:

 
View My Stats