సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలి కోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భారత పతాకం
ఆవేశంలో ప్రతినుముషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచేనదిగో ఎగిరే భారత పతాకం
చెరుగుతుంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల వైభవమ్
కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచుశిఖరం
కలహముల హాలా హలానికి మరుగుతున్నది హిందుసంద్రం
దేశమంటే మట్టికాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురూపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువునా ఈ వికృత గాయం
No comments:
Post a Comment